యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?

యూట్యూబ్ ద్వారా ఇంటి నుండే సంపాదించటం ఎలా

YouTube స్టార్స్ అనేవాళ్ళు self-made celebrities. ఆన్లైన్ క్లాస్ లు చెప్పడం, కామెడీ వీడియోస్ చేయడం, రివ్యూలూ వ్రాయడం మరియు ఇంటర్నెట్‌లో అద్భుతమైన  కంటెంట్‌ను  ద్వారా ప్రేక్షకులను సంపాదించిన వ్యక్తులు.

యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి డబ్బు సంపాదించడం ఒక్కటే మీ కారణం కాకపోవచ్చు, కాని వాటిలో డబ్బు సంపాదించే అవకాశాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.   

YouTube పార్ట్నర్  ప్రోగ్రామ్‌లో డబ్బు సంపాదించడానికి మార్గాలు:

సాధారణంగా మీ ఛానెల్ లో చూడటానికి ఎంత ఎక్కువ కంటెంట్ ఉంటే మీకు అంత ఎక్కువ డబ్బు వస్తుంది.  మీరు ఈ క్రింది ఫీచర్స్ ద్వారా YouTube లో డబ్బు సంపాదించవచ్చు: 

  • అడ్వర్టైజింగ్ రెవిన్యూ: ఫొటోస్ మరియు వీడియో యాడ్ లను మన ఛానెల్ లో డిస్ప్లే చేయదం ద్వార యాడ్ రెవిన్యూ పొందండి.
  • ఛానెల్ మెంబర్స్: మీరు అందించే ఇంటరెస్టింగ్ కంటెంట్  బదులుగా మీ ఛానెల్ మెంబర్స్, మీకు రిక్కరింగ్ నెలవారీ పేమెంట్స్   చేస్తారు. 
  • మర్చండైజ్ షెల్ఫ్: మీ అభిమానులు మీ పేజీలలో డిస్ప్లే  చేయబడే  అఫీషియల్ బ్రాండెడ్ ఐటెంస్ బ్రౌజ్ చేస్తారు మరియు కొనుగోలు చేయవచ్చు.
  • సూపర్ చాట్ & సూపర్ స్టిక్కర్స్: మీ అభిమానులు వారి మేసెజ్ లను చాట్ స్ట్రీమ్‌లలో హైలైట్ చేయడానికి డబ్బు చెల్లిస్తారు.
  • YouTube  ప్రీమియం రెవిన్యూ: ఆడియన్స్ మీ కంటెంట్‌ను చూసినప్పుడు YouTube ప్రీమియం సబ్స్క్రైబర్స్ యొక్క సబ్ స్క్రిప్షన్ ఫీ లో కొంత భాగాన్ని పొందండి.

మీరు YouTube పార్ట్నర్  ప్రోగ్రామ్‌లో అంగీకరించిన తర్వాత, మీరు మానిటైజేషన్ ఫీచర్స్ కి యాక్సెస్ పొందవచ్చు.

 

Requirements

యాడ్ రెవిన్యూ

AdSense ద్వారా మీ పేమెంట్స్ డీల్ చేయడానికి మీకు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి  లేదా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వారిని  లీగల్ గార్దియన్ గా కలిగి ఉండండి.

అడ్వర్టైజర్-ఫ్రెండ్లి కంటెంట్ గైడ్లైన్స్ కు అనుగుణంగా కంటెంట్‌ను క్రియేట్ చేయండి. 

ఛానెల్ మెంబర్షిప్

కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

30,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉండాలి.

మర్చండైజ్ షెల్ఫ్

కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

10,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉండాలి.

సూపర్ చాట్ & సూపర్ స్టిక్కర్స్

కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

సూపర్ చాట్ అందుబాటులో ఉన్న దేశం / ప్రాంతంలో నివసించండి.

YouTube ప్రీమియం రెవిన్యూ 

YouTube  ప్రీమియం సబ్స్క్రైబర్ చూసె  కంటెంట్‌ను క్రియేట్ చేయండి.    

ముగింపు:

చాలా మంది కంటెంట్ క్రియేటర్స్, కంటెంట్ క్రియేట్ చేయడానికి   ముఖ్య కారణం డబ్బు మరియు ఆడియన్స్ కి ఎంటర్టైన్   అందించడానికి ఏదైనా చేయాలనే ఆలోచన.

అనేక బిజినెస్ లకు కష్టతరమైన భాగం వారి కస్టమర్స్ దృష్టిని ఆకర్షించడం, యూట్యూబర్స్ ఇప్పటికే ఆ విషయాన్ని గుర్తించారు.

చివరిగా మెము చెప్పేది ఒక్కటే.. మీకు ఉన్న ఇంటరెస్ట్ ని డబ్బు సంపాదించే ఆదాయ మార్గంగా మలుచుకోండి.