ఇంటి నుండి ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?

ఆన్‌లైన్ ద్వారా ఇంటినుండే సంపాదించటం ఎలా

డబ్బు సంపాదించడం సాధారణంగా ‘ఆఫ్‌లైన్’ మార్గంతో ముడిపడి ఉంటుంది. ఇంటర్నెట్ మన జీవితంలోకి వచ్చిన తరువాత, ఎక్కువ మంది ప్రజలు ద్వితీయ ఆదాయ మార్గంతో, వారి ఆదాయం పెంచుకోడానికి ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించే మార్గాలను చూస్తున్నారు.

మీరు ఎంచుకునే ప్లాట్‌ఫాం గురించి మీరు జాగ్రత్త వహించాలి. ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, వాటిలొ కొన్ని నకిలీవి ఉంటాయి. అలాగే, డబ్బు సంపాదించడానికి ఆన్‌లైన్ మార్గాలను ఉపయోగించినప్పుడు త్వరగా పెద్ద మొత్తాన్ని సంపాదించాలని ఆశించవద్దు.

సాధారణంగా తక్కువ పని గంటలు ఉన్నవారికి, ఇంట్లో ఎక్కువ ఖాళీ సమయం ఉన్నవారికి ఈ ఆర్టికల్ యెంతగానో ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడంలో మీకు సహాయపడే కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు మరియు వెబ్‌సైట్‌లు ఇక్కడ అందిస్తున్నాం.

1. ఫ్రీలాన్సింగ్:

ఫ్రీలాన్సింగ్ ఎల్లప్పుడూ ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి ఒక ప్రసిద్ధ మార్గం మరియు ఫ్రీలాన్సింగ్ కి ఇంటర్నెట్‌లో అనేక ఆప్షన్స్ ఉన్నాయి. విభిన్న నైపుణ్యాలు ఉన్న వ్యక్తుల కోసం ఫ్రీలాన్స్ పనులను అందించే అనేక వెబ్‌సైట్లు ఉన్నాయి.

మీరు చేయాల్సిందల్లా ఒక అకౌంట్ క్రియేట్ చేయడం, జాబితాల ద్వారా బ్రౌజ్ చేయడం మరియు మీకు సరిపోయే పని కోసం దరఖాస్తు చేయడం. కొన్ని వెబ్‌సైట్‌లు మీ నైపుణ్య వివరాలతో వ్యక్తిగత జాబితాను క్రియేట్  చేయమని కూడా మిమ్మల్ని కోరవచ్చు, తద్వారా ఆసక్తి గల క్లయింట్లు మిమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు.

fiverr.com, upwork.com, freelancer.com, మరియు  worknhire.com ఫ్రీలాన్స్ ఉద్యోగాలను అందించే కొన్ని వెబ్‌సైట్లు. ఈ వెబ్‌సైట్ల ద్వారా మీరు ఎక్కడైనా రూ.500 నుండి రూ.10,000 వరకు సంపాదించవచ్చు.

ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎమిటంటే, ఇచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేసి, క్లయింట్ చేత ఆమోదించబడిన  తర్వాత మాత్రమే మీకు డబ్బు వస్తుంది. మీరు చేసిన పని మీ క్లయింట్ కి  నచ్చకపొతే మీరు ఆ పనిని మరలా చేయవలసి ఉంటుంది.

Paypal అకౌంట్ క్రియేట్ చేయమని కొన్ని సైట్లు మిమ్మల్ని అడగవచ్చు, ఎందుకంటే చాలా మంది క్లయింట్లు దాని ద్వారా డిజిటల్‌గా చెల్లింపులు చేయడానికి ఇష్టపడతారు.

2. మీ స్వంత వెబ్‌సైట్‌ను ప్రారంభించడం:

మీ స్వంత వెబ్‌సైట్‌ను క్రియేట్ చేయడంలో మీకు సహాయపడటానికి ఆన్‌లైన్‌లో తగినంత సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మీ వెబ్‌సైట్ కోసం Domain, Templates, Layout మరియు మొత్తం డిజైన్‌ను ఎంచుకోవాలి.

ఉపయోగకరమైన అయిన కంటెంట్‌ని విజిటర్స్ కి అందించడానికి సిద్ధంగా ఉంటే, Google Adsense  కోసం సైన్ అప్ చేయండి, ఇది మీ వెబ్‌సైట్‌లో కనిపించినప్పుడు మరియు విజిటర్స్ చే క్లిక్ చేసినప్పుడు, డబ్బు సంపాదించడంలో మీకు సహాయపడుతుంది. మీ వెబ్‌సైట్‌లో మీకు ఎక్కువ ట్రాఫిక్ వస్తే, ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.

3. అఫ్లియెట్ మర్కెటింగ్:

మీరు వెబ్‌సైట్ క్రియేట్ చేసిన తర్వాత, మీ సైట్ లో ఇతర కంపెనీల వెబ్ లింక్‌లను ఉంచడానికి అనుమతించడం ద్వారా మీరు అఫ్లియెట్ మర్కెటింగ్ చేయవచ్చు. ఇది సహజీవన భాగస్వామ్యం లాంటిది. మీ వెబ్‌సైట్‌లో విజిటర్స్  అటువంటి లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా ఉత్పత్తులు లేదా సేవలను కొనుగోలు చేసినప్పుడు, మీరు దాని నుండి సంపాదిస్తారు.

4. సర్వేలు, శోధనలు మరియు రివ్యూలు:

ఆన్‌లైన్ సర్వేలు చేయటానికి, ఆన్‌లైన్ శోధనలు చేయడానికి మరియు ఉత్పత్తులపై రివ్యూలు వ్రాయడానికి డబ్బును అందించే అనేక వెబ్‌సైట్లు ఉన్నాయి. పని చేసిన తర్వాత డబ్బు పొందడానికి, మన బ్యాంకింగ్ వివరాలతో సహా వారికి కొంత సమాచారాన్ని వెల్లడించాలి. 

అందువల్ల మీరు ఈ పనిని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. వీటిలో కొన్ని ప్రాజెక్టులలో పనిచేసే ముందు రిజిస్టర్ అవ్వమని కూడా మిమ్మల్ని అడగవచ్చు.  అటువంటి ప్రాజెక్టులలో చూడవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ నుండి డబ్బును అడిగే వెబ్‌సైట్‌లకు దూరంగా ఉండటం మంచిది.

సర్వేలు చేయమని, ఉత్పత్తులపై రివ్యూలు వ్రాయమని మీకు పని ఇచ్చే వెబ్‌సైట్ ని యెంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాటిలో చాలా స్కామ్ ఉండవచ్చు. చాలా సైట్లు నేరుగా డబ్బు ఇవ్వకుండా మరియు బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫెర్ చేయకుండా, చెక్ చెల్లింపుల కాపీలను చూపించి మోసం చేస్తాయి.

5. వర్చువల్ అసిస్టెంట్షిప్ (VA):

ఒకరి ఇంటి నుండి అన్ని కార్పొరేట్ పనులను చేయడాన్ని వర్చువల్ అసిస్టెంట్షిప్ (VA) అంటారు. VAs ప్రాథమికంగా తమ క్లయింట్‌లతో రిమోట్‌గా పనిచేస్తారు మరియు క్లయింట్ లు బిజీగా ఉన్నప్పుడు వారు చేయవలసిన వ్యాపార అంశాలను VAs నిర్వహిస్తారు.

మీరు వర్చువల్ అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడు, మీరు ఉద్యోగిగా పనిచేయడానికి ఎంచుకోవచ్చు లేదా మీరు మీ స్వంత వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 

VA లు నైపుణ్యం కలిగిన, home-based నిపుణులు. వీరు కంపెనీలకు, వ్యాపారాలకు మరియు వ్యవస్థాపకులకు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అందిస్తారు.

ఫోన్ కాల్స్, ఈమెయిల్ కరస్పాండెన్స్, ఇంటర్నెట్ రీసెర్చ్, డేటా ఎంట్రీ, అపాయింట్‌మెంట్స్ షెడ్యూల్, ఎడిటింగ్, రైటింగ్, బుక్ కీపింగ్, మార్కెటింగ్, బ్లాగ్ మేనేజ్‌మెంట్, ప్రూఫ్ రీడింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, గ్రాఫిక్ డిజైన్, టెక్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, ఈవెంట్ ప్లానింగ్ మరియు సోషల్ మీడియా నిర్వహణ లాంటి పనులు మీరు చేయవలసి ఉంటుంది.

VA అవ్వడానికి మీ అర్హతలను బట్టి కొంత శిక్షణ లేదా బ్రీఫింగ్ అవసరం. మీరు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండి మరియు MS Office అప్లికేషన్స్ లను ఉపయోగించగల సామర్థ్యం కలిగి ఉంటే  Elance.com, 24/7 Virtual Assistant, Assistant Match, eaHelp, Freelancer, FlexJobs, People Per Hour, Uassist.Me, Upwork, VaVa Virtual Assistants, Virtual Staff Finder, Worldwide 101, Ziptask, Zirtual మరియు మొదలైన సైట్ లలో  రిజిస్టర్  అవ్వండి.

6. భాషా అనువాదం:

ఇంగ్లీష్ కాకుండా వేరే భాష తెలుసుకోవడం మీకు కొంత అదనపు డబ్బు సంపాదించడానికి కూడా సహాయపడుతుంది. ఒక డాక్యుమెంట్ ను ఒక భాష నుండి మరొక భాషలోకి అనువదించాల్సిన ట్రాన్స్లేషన్ ప్రాజెక్టులను అందించే అనేక వెబ్‌సైట్లు ఉన్నాయి. ఇందులో స్పానిష్, ఫ్రెంచ్, అరబ్, జర్మన్ లేదా ఇంగ్లీషు నుండి లేదా ఇతర భాషలు ఉండవచ్చు.

చాలా మందికి, ఈ పని ఎక్కువ సమయం తీసుకుంటుంది మరియు అందువల్ల వారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుండైనా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ట్రాన్స్లేటర్ లను తీసుకుంటారు. Freelancer.in, Fiverr.com, worknhire.com లేదా Upwork.com వంటి అనేక వెబ్‌సైట్లు మీకు ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ గా ఉండటానికి అవకాశం కలిపిస్తాయి.

సొంతంగా తమ ప్రాజెక్టులను పూర్తి చేసుకొనే జ్ఞానం లేదా సమయం లేని వారు, Freelancer.in, Fiverr.com, worknhire.com లేదా Upwork.com ఈ ప్లాట్‌ఫామ్‌లలో అప్లోడ్ చేస్తారు. 

మీరు ఈ సైట్ లలో  రిజిస్టర్ అయి డాక్యుమెంట్ లను ట్రాన్స్లెట్ చేయడం ద్వారా ఒక్కో పదానికి రూ.1 – రూ.5 రూపాయలు పొందవచ్చు. ఇది కొన్ని భాషలకు రూ .10 వరకు సంపాదించవచ్చు.

7. ఆన్‌లైన్ ట్యూటరింగ్:

మీరు ఒక నిర్దిష్ట సబ్జెక్టులో నిపుణులైతే, ఆన్‌లైన్‌లో వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు. ఆన్‌లైన్ ట్యూటరింగ్ దేశవ్యాప్తంగా అన్ని వయసుల విద్యార్థులతో ఆన్‌లైన్‌లో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. మీరు నైపుణ్యం  పొందిన అంశాలలో హోంవర్క్ చేయడంలో  సహాయం అందించడం మరియు ట్యూటరింగ్ ద్వారా ఆదాయం పొందవచ్చు.

Vedantu.com, MyPrivateTutor.com, BharatTutors.com, tutorindia.net వంటి వెబ్‌సైట్‌లలో  అకౌంట్ క్రియేట్ చేసి, మీ అర్హత, అనుభవం, మీరు ట్యూటరింగ్ చేయాలి అనుకున్న సబ్జెక్ట్స్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు ఆన్‌లైన్ ట్యూటర్‌గా పనిచేయడానికి మీకు అనువైన మరియు అనుకూలమైన సమయాన్ని కేటాయిస్తాయి.

చాలా ప్లాట్‌ఫారమ్‌లు ఈ విధానాన్ని అనుసరిస్తాయి. ఒక సాధారణ ఫారమ్‌ను నింపడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారు మిమ్మల్ని అడుగుతారు. 

ఆ తర్వాత ఏదైన సబ్జెక్ట్ ట్యూటరింగ్ డెమో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత, డాక్యుమెంటేషన్ మరియు ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దాని తరువాత ఇంట్రడక్షన్ వెబినార్ మరియు శిక్షణ ఉంటాయి.

మీరు వెబ్‌నార్‌కు హాజరైన తర్వాత, మీరు టీచర్స్ లిస్ట్ లో చేర్చబడతారు మరియు మీ ఆన్‌లైన్ సెషన్లను నిర్వహించడానికి స్లాట్ పొందుతారు. మొదట్లో గంటకు సుమారు 200 రూపాయలు సంపాదించవచ్చు, మీరు అనుభవం మరియు నైపుణ్యాన్ని పొందినప్పుడు ఇది రూ .500 వరకు ఉంటుంది.

ముగింపు:

చాలా మంది ఓటమికి భయపడతారు మరియు వారు ఏమీ ప్రారంభించరు. మీకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడం నా బాధ్యత, కాని ఆచరణలో పెట్టాల్సింది మీరే.  

మొదటి అడుగు వేయండి మరియు మీ రెండవ ఆదాయ మార్గాన్ని యేర్పాటు చేసుకొండి.