బ్లాగింగ్ ఎలా చేయాలి? మొదలుపెట్టే ముందు కావలసినవి

బ్లాగింగ్ మొదలుపెట్టే ముందు ఏమేమి కావాలి

మీకు కోడింగ్ లేదా వెబ్ డిజైన్ గురించి ఏవిధమైన ఎక్స్పిరియన్స్ లేనప్పటికీ 2020 లో, బ్లాగును ప్రారంభించడం గతంలో కంటే సులభం.

కొంచెం గైడెన్స్ మరియు సరైన టూల్స్ తో, మీరు మీ స్వంత వ్యక్తిగత లేదా బిజినెస్ బ్లాగును 30 నిమిషాల కన్నా తక్కువ టైం లో క్రియేట్ చేయవచ్చు. కాని బ్లాగ్ పోస్ట్‌లు మరియు కంటెంట్ రాయడానికి చాలా సమయం పడుతుంది.

ఇలా బ్లాగును క్రియెట్ చేసేటప్పుడు, క్రొత్త బ్లాగర్లు చేసే సాధారణ తప్పులను మీరు చేయకుండా ఉండడానికి మేము మీకు సహయం చేస్తాం.  

వినడానికి చాలా బాగుంది కదా! మరి ఇంక ఎందుకు ఆలస్యం. బ్లాగు క్రియేట్ చేయడానికి  కావలసినవి ఏంటో చూసేద్దాం.

బ్లాగును క్రియేట్ చేయడానికి సంబంధించి  4 కామన్ క్వశ్చన్స్

1. బ్లాగ్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది?

బ్లాగ్ టాపిక్ ఎంచుకోవడం ఎక్కువ టైం పడుతుంది కాని, మీరు ఏ టాపిక్ గురించి   వ్రాయాలనుకుంటున్నారో మీకు తెలిస్తే, మీరు కేవలం 20-30 నిమిషాల్లో బ్లాగును క్రియేట్  చేయవచ్చు. ఇది నిజంగా మీరు అనుకున్నదానికన్నా సులభం!   

2. బ్లాగును క్రియేట్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందా?  

కాదు! నేను చేప్పే పద్ధతి 100% ఉచితం కానప్పటికీ, మీరు మొదటి సంవత్సరానికి ~ రూ.6000 తో  బ్లాగ్ క్రియేట్ చేయవచ్చు అంటే నెలకు రూ.500 వరకు ఖర్చు అవుతుంది. 

3. బ్లాగును క్రియేట్ చేయడానికి నేను ఫ్రీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాన్ని ఉపయోగించవచ్చా?   

హబీగా అప్పుడప్పుడు కంటెంట్ రాసే బ్లాగులకు ఉచిత ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగించవచ్చు. కాని నిజం ఏమిటంటే ఉచిత ప్లాట్‌ఫారమ్‌లతో మీకు నచ్చినట్లు మీ బ్లాగును డిజైన్ చేసుకోలేరు మరియు ప్లాట్‌ఫారమ్‌లు మూసివేయబడితే, మీరు మీ బ్లాగును కోల్పోతారు. నేను మీకు చూపించబోయే పద్ధతి  మీ బ్లాగుపై మీకు కంట్రోల్ ఇస్తుంది, మీ కంటెంట్‌ను రక్షిస్తుంది మరియు మీరు ఎప్పుడైనా మీ బ్లాగ్ నుండి డబ్బు సంపాదించాలనుకుంటే అనువైనది.  

4. బ్లాగును ప్రారంభించడానికి నాకు సాఫ్ట్ వేర్ నాలెడ్జె ఉండాల్సిన అవసరం ఉందా? 

అవసరం లేదు! మీరు కంప్యూటర్‌ను ఉపయోగించడం మరియు ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసే అంత నాలెడ్జె ఉంటే చాలు, మీ స్వంత బ్లాగును ప్రారంభించడానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ లాంటి ప్రత్యేక జ్ఞానం అవసరం లేదు. 

బ్లాగింగ్ మొదలుపెట్టే ముందు మిమ్మల్ని మీరు ఈ 3 క్వశ్చన్స్ అడగండి:

1. నేను ఈ టాపిక్ గురించి రాస్తున్నప్పుడు ఆనందిస్తున్నానా?  

మీరు మీ బ్లాగును క్రియేట్ చేసి ఆర్టికల్స్ రాసిన తర్వాత, విజిటర్స్ మీ బ్లాగ్ కి వాటిని చదివేల చేయడనికి  కొంత సమయం పడుతుంది.

అందువలన మీరు ఫూచర్ లో కూడా ఆడియన్స్ ఇంటరెస్టింగ్ గా చదివే టాపిక్  ఎంచుకోవడం ముఖ్యం.

మీ బ్లాగ్ కి వేలాది మంది విజిటర్స్ రాకపోయినా, ఇప్పటి నుండి రెండు నెలల తర్వాత కూడా మీరు ఈ టాపిక్ పై ఆసక్తికరంగా పోస్టులు రాయగలుగుతారా?  

మీరు కాని ఎక్కువ పాషనేట్ గా లేకపొతే డైలీ క్రొత్త పోస్ట్‌లు రాయడం కష్టం గా ఉంటుంది.

2. ఇతర వ్యక్తులు కూడా ఈ టాపిక్ పై ఇంటరెస్ట్ కలిగి ఉన్నారా?

ఫ్యూచర్ లో ఎక్కువ మంది ఇంటరెస్ట్ చూపిస్తారని ఒక టాపిక్ మీకు దొరికితే, తర్వాత ఆలోచించవలసిన ప్రశ్న: 

“ఇతర వ్యక్తులు కూడా, నాకు ఉన్నట్లుగా ఈ టాపిక్ పై ఎక్కువ ఇంటరెస్ట్ చూపుతున్నారా?”

మీరు ఎంచుకున్న టాపిక్ పై ఆడియన్స్ ఇంటరెస్ట్ కలిగి ఉన్నారని మీకు ఇప్పటికే తెలిస్తే అది మీ బ్లాగు ట్రాఫిక్ పెంచుకోవడానికి మీకు సహాయపడుతుంది.

Don’t worry – ఇది చేయడానికి మీరు మనస్సులను చదవగలిగే అవసరం లేదు.

మీ టాపిక్ పై ఆడియన్స్ ఇంటరెస్ట్ కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మీకు సహాయపడే కొన్ని ఫ్రీ టూల్స్  ఉన్నాయి.

KWFinder –  ఇందులో మీ టాపిక్ కి సంబంధించిన ఏదైన కీవర్డ్ ఎంటర్ చేసినప్పుడు, ఆ టాపిక్ గురించి ఎంత మంది సెర్చ్ చేస్తున్నారు మరియు ఎంత పాపులారిటి ఉంది అని చూపిస్తుంది.              

గూగుల్‌లో చాలా మంది ప్రజలు ఒక టాపిక్ కోసం సెర్చ్ చేస్తున్నారు అంటే, ఆ టాపిక్ కి  

సంబంధించి మీ బ్లాగ్ లో ఆర్టికల్ రాసినప్పుడు ఎక్కువ మంది విజిటర్స్ వచ్చే అవకాసం ఉంది. 

Facebook Groups – మీరు ఎంచుకున్న టాపిక్ పై ఆడియన్స్ యొక్క ఇంటరెస్ట్ ని అంచనా వేయడానికి ఫేస్‌బుక్ గొప్ప మార్గాన్ని అందిస్తుంది. 

మీ టాపిక్ ని కవర్ చేసే ఫేస్‌బుక్ గ్రూప్స్ కోసం సెర్చ్ చేయడనికి ట్రై చేయండి మరియు అందులో ఎంత మంది యాక్టివ్ మెంబర్స్  ఉన్నారో చూడండి.

మీ టాపిక్ కి సంబంధించి ఫేస్‌బుక్ గ్రూప్స్ లో వేల సంఖ్యలో మెంబర్స్ ఉంటే మీరు ఎంచుకున్న టాపిక్ పై ఎక్కువ మంది ఇంటరెస్ట్ గా ఉన్నరు అని అర్డం.

Google Trends ఈ టూల్  ఉపయొగించడం చాలా ఈజీ మరియు మీరు ఎంచుకున్న టాపిక్ పై ఆడియన్స్ ఇంటరెస్ట్ పెరుగుతుందా లేదా తగ్గుతుందో త్వరగా చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 

3. నేను ఈ టాపిక్ నుండి డబ్బు సంపాదించవచ్చా?

మీరు కొంచెం క్రియేటివ్ గా ఉంటే, చాలా టాపిక్స్   నుండి డబ్బు సంపాదించవచ్చు. కానీ కొన్ని విషయాలు ఇతరులకన్నా డబ్బు ఆర్జనకు ఖచ్చితంగా సరిపోతాయి.

For Example, క్రెడిట్ కార్డులను ఎంత బాగా ఉపయోగించుకోవాలో టాపిక్ గురించి మీ దగ్గర బాగా పాపులర్ అయిన బ్లాగ్ ఉంటే, మీ వద్ద డబ్బు అయిన ఇచ్చే క్రెడిట్ కార్డ్ కంపెనీలు మీ తలుపు తట్టడం ఖాయం.

మీరు మీ బ్లాగ్ నుండి డబ్బు సంపాదించాలని ఆలోచిస్తుంటే, కింద ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి:

  • నా బ్లాగ్ పాపులర్ అయిన తర్వాత,డబ్బు ఇచ్చి బ్యానర్ యాడ్స్ డిస్ప్లే కంపెనీలు ఉన్నాయా? 
  • ఆడియన్స్ కొనుగోలు చేయడానికి ఇంటరెస్ట్ చూపే విధంగా నేను ఇబుక్ లాగా నా స్వంత ప్రోడక్ట్ ని డెవలప్ చేయగలనా? 

మీ బ్లాగ్ టాపిక్ ఎంచుకోవడం ఎలా? 

మీరు చేయవలసిన మొదటి పని మీ బ్లాగ్ కోసం ఒక టాపిక్ ఎంచుకోవడం.

చాలా విజయవంతమైన బ్లాగులు ఒకే విషయం మీద దృష్టి పెడతాయి. ఇది ఫుడ్,  ట్రావెలింగ్, ఫిట్‌నెస్, ఫ్యాషన్ లేదా మీ బిజినెస్ గురించి కావచ్చు. 

మీకు ఆసక్తి ఉన్న అంశాన్ని ఎన్నుకోవాలని మేము సలహ ఇస్తున్నాము. మీకు ఏదో ఒక విషయంలో బాగా ఎక్స్పిరియన్స్ ఉన్నప్పుడు ఇది మరింత మంచిది, ఇతరులకు సహాయపడటానికి, మంచి నాణ్యమైన కంటెంట్ రాయడం ద్వారా మీ బ్లాగు ట్రాఫిక్ పెంచుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. 

బ్లాగ్ టాపిక్ ఎంచుకోవడానికి టిప్స్: 

  • మీకు ఏదైనా ఒక విషయంలో బాగా ఎక్స్పిరియన్స్ ఉందా? 
  • మీరు దేని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారా?
  • మీరు ఏదైనా  క్రొత్త విషయం నేర్చుకుంటున్నారా మరియు ఆ ప్రాసెస్ గురించి రాయాలనుకుంటున్నారా?

మీరు ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటే మరియు మీరు ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే,  ఫిట్‌నెస్‌కు సంబంధించిన బ్లాగులో మీ జ్ఞానం పంచుకోవడం లేదా ట్రైనింగ్ మరియు న్యూట్రిషన్ కు సంబంధించిన అంశాలను కవర్ చేయడం  ద్వారా, మీరు క్రొత్త క్లయింట్లను పొందగలుగుతారు.

మీరు వెంటనే మీ బ్లాగ్ టాపిక్ ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం టైం తీసుకుని ఆలోచించండి.  

ముగింపు:

బ్లాగింగ్ మొదలుపెట్టే ముందు కావలసిన వాటి గురించి తెలుసుకోడానికి ఈ ఆర్టికల్ ఉపయోగపడింది అని అనుకుంటున్నాను.  

ఒకసారి మీరు మీ బ్లాగింగ్ కెరీర్ లోకి ఎంటర్ ఐన తర్వాత, మీ బ్లాగును ఇంకా బాగా డెవలప్ చేయడానికి మరియు డబ్బు సంపాదించడానికి మరిన్ని క్రొత్త టెక్నిక్స్ తెలుసుకుంటారు .